విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళంలో ‘వర్మ’గా తెరకెక్కుతోంది. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో సంచలనం సృష్టించిన ఈ సినిమాపై తమిళంలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈరోజు విడుదలైన ‘వర్మ’ ట్రైలర్ చూస్తుంటే.. తమిళ నెటివిటీకి తగినట్లు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఇంట్లోని పనిమనిషి పాత్ర నిడివి పెంచినట్లుగా ఉంది. ఈ పాత్రను ఈశ్వరీరావు పోషిస్తున్నారు. షాలినీ పాండే పాత్రలో మేఘా చౌదరీ నటించింది. కానీ, ‘అర్జున్’ రెడ్డి సినిమాలో ఉన్నట్లే ఇందులోనూ లిప్‌లాక్స్, ఫైట్లు ఉన్నాయి. అర్జున్ రెడ్డితో పోల్చితే.. ఏదో మిస్సయిన ఫీల్ కనిపిస్తోంది. సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa