గత ఏడాది కిరాక్ పార్టీ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చాడు యంగ్ హీరో నిఖిల్. ఈచిత్రం తరువాత ముద్ర అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా రీమేకే కావడంవిశేషం. ఈచిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రం తో పాటు నిఖిల్ ‘శ్వాస’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు కిషన్ కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాలే కాకుండా మరి కొన్ని ప్రాజెక్టులకు కూడా సైన్ చేశాడట ఈ హీరో.
అంతేకాకుండా ఈ ఏడాది మూడు సినిమాల్తో ప్రేక్షకులముందుకు వస్తానని రేపటి నుండి కొత్త సినిమాల వివరాలను అలాగే ముద్ర రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తానని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. మరి ఆ మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి నిఖిల్ ఈ ఏడాది ని మెమరబుల్ ఇయర్ గా మార్చుకుంటాడో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa