నాలుగేళ్ళ విరామం తదుపరి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "పఠాన్". సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
రేసెంట్గానే పఠాన్ నుండి 'బేషరం రంగ్' వీడియో సాంగ్ విడుదలై ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికి తెలుసు. అలానే ఈ సాంగ్ ఎంతటి కాంట్రవర్సీని సృష్టించిందో కూడా తెలిసిందే. ఈ సాంగ్ లో దీపికా సాఫ్రాన్ కలర్ బికినీ ధరించి, షారుఖ్ వంటి సీనియర్ స్టార్ హీరో సరసన కొన్ని అసభ్యకరమైన సీన్లలో నటించింది. దీంతో పఠాన్ పై కొంతమంది ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ ..రెండిటిలో తెగ విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పఠాన్ సినిమా మేకర్స్ కి సెన్సార్ బృందం నుండి ఒక ఆర్డర్ వెళ్లిందట. సినిమాలో కొన్ని కీలకమైన మార్పులు చెయ్యమని ముఖ్యంగా పాటలలో తప్పక మార్పులు చెయ్యాలని సెన్సార్ బృందం పఠాన్ మేకర్స్ ని ఆదేశించినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa