టాలీవుడ్ చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఒకరు. యంగ్ ట్యాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అప్ కమింగ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్...ఇలా ఎవరిలో అయినా ప్రతిభ ఉంది అని అల్లు అరవింద్ కి అనిపిస్తే, వెంటనే గీతా ఆర్ట్స్ లో క్రేజీ డీల్స్ ను వారికి ఆఫర్ చేస్తుంటారు.
లేటెస్ట్ గా ఒక యంగ్ హీరోకి అల్లు అరవింద్ బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో నిఖిల్ కు అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేసుకునే ఒక సువర్ణావకాశాన్ని ఇచ్చారు. నిఖిల్, బన్నీ వాసు సరైన స్క్రిప్ట్స్ ఎంచుకుని అతి త్వరలోనే అధికారిక ప్రకటన చెయ్యనున్నారు.