వింటేజ్ చిరంజీవిని స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేసేందుకు మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు... అదేనండి.. మెగాస్టార్ చిరంజీవి గారి న్యూ ఫిలిం "వాల్తేరు వీరయ్య" సినిమా విడుదల కోసం మెగాఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మాస్ రాజా రవితేజ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది.
సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా జరపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు వైజాగ్ లో జనవరి 7/8 న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. తాజా బజ్ ప్రకారం, ఈ ఈవెంట్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే కనుక ఈ ఈవెంట్ కు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటెత్తడం ఖాయం. మరి, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.