కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియులకు అభిమాన హీరో అయ్యాడు యశ్. ఇక ఇటీవలే టీమ్ఇండియా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్య, యశ్‌తో కలిసి దిగిన ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను హార్టిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'కేజీఎఫ్ 3' అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో సినిమా, క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కేజీఎఫ్ 3లో హార్దిక్ ఏమైనా రోల్ ఉంది కావచ్చు అని మరో అభిమాని ఫన్నీ కామెంట్ పెట్టాడు.