నాచురల్ స్టార్ నాని గారు ఈ ఏడాది 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నారు. ఆపై 'హిట్ 2' సినిమాతో నిర్మాతగా గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం నాని తన తొలి పాన్ ఇండియా మూవీ "దసరా" ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తదుపరి చెయ్యబోతున్న సినిమాపై ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అధికారిక సమాచారం ఇవ్వబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇప్పటివరకు కెరీర్ లో 29 సినిమాలు చేసిన నాని మైల్ స్టోన్ ముప్పైవ సినిమాను ఎవరితో చెయ్యబోతున్నారో తెలుసుకోవాలని అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.