ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ ఇయర్ ట్రీట్ గా.. నాచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ఎనౌన్స్మెంట్ 

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 04:25 PM

ఇప్పటివరకు 28 విభిన్న సినిమాలలో, 28 విలక్షణ పాత్రలలో నటించిన నాచురల్ స్టార్ నాని 29 వ సినిమాగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'దసరా' చేస్తున్న విషయం తెలిసిందే. దసరా తదుపరి నాని ఎవరితో సినిమా చెయ్యనున్నారన్న విషయంపై ఇప్పటివరకు చిన్న అప్డేట్ కూడా లేదు. లేటెస్ట్ గా ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ వచ్చింది.


న్యూ ఇయర్ 2023 కానుకగా జనవరి 1వ తేదీన అంటే ఆదివారం సాయంత్రం 04:05 నిమిషాలకు నాని నెక్స్ట్ మూవీ అప్డేట్ రాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాతో వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ టాలీవుడ్ నిర్మాణరంగ ప్రవేశం చేస్తుంది. మరి, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయం ఇంకా బయటకు రాలేదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa