పాపులర్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ రోజురోజుకీ ప్రజాదరణ కోల్పోతోంది. ఈ కారణంగానే వరుసగా షో హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున వచ్చే ‘బిగ్ బాస్ 7’ సీజన్ హోస్ట్ గా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త హోస్ట్ గా బాలకృష్ణ, రానా పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు పేరు కూడా వినిపిస్తోంది. వచ్చే సీజన్ విష్ణు హోస్ట్ చేయనున్నట్లు టాక్. దీనిపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే ఒకవేళ నిజమైతే హోస్ట్ గా మంచు విష్ణు ఎలా మెప్పిస్తారనేది చూడాల్సి ఉంది.