ఆనంద్ రవి హీరోగా పరిచయమవుతున్న చిత్రం "కొరమీను". ఇందులో కిషోరీ ధాత్రిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను మాంగో మాస్ మీడియా సమర్పిస్తుంది. శ్రీపతి కర్రీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్, ఇద్దరు సాధారణ జాలర్ల ఈగోల నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపే థియేటర్లకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి, ఈ సినిమాలో పోలీసాఫీసర్ మీసాలను ఎవరో కత్తిరిస్తారు? ఆ పని చేసింది ఎవరో తెలుసుకునే క్రమంలో పోలీసాఫీసర్ కి ఎదురైన వింత మనుషులు, పరిస్థితులు... ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ సినిమాలో రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
మీసాలరాజు గారి మీసాలను ఎవరు దొంగిలించారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా..?ఐతే, రేపు కొరమీను సినిమాను థియేటర్లో చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa