ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీరసింహారెడ్డి' ట్రైలర్ విడుదలయ్యేది అప్పుడేనా..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 05:34 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి "వీరసింహారెడ్డి" గా థియేటర్లకు వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.


వీరసింహారెడ్డి నుండి ఇప్పటివరకు మూడు లిరికల్ పాటలు విడుదలవగా, అతి త్వరలోనే నాల్గవ పాట కూడా విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


లేటెస్ట్ బజ్ ప్రకారం, వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సర్ప్రైజింగ్ గా ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోలు లో జరగబోతుందని తెలుస్తుంది. ఐతే, ఈ విషయాలపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa