ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణ్ బీర్ కపూర్ "యానిమల్" ఫస్ట్ లుక్ రిలీజ్ టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 06:03 PM

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రణ్ బీర్ కపూర్ తో 'యానిమల్' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గుల్షన్ కుమార్, టి సిరీస్ సమర్పిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు.


శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రణ్ బీర్ అభిమానులు ఈ న్యూ ఇయర్ ని యానిమల్ తో సెలెబ్రేట్ చేసుకునే విధంగా డిసెంబర్ 31న యానిమల్ ఫస్ట్ లుక్ విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.


ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీరోల్స్ లో నటిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa