బాలీవుడ్ లో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మున్నాభాయ్ సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు తెలుగులో రీమేక్ అయ్యాయి. మూడో సినిమా మున్నాభాయ్ 3 ని ఇటీవలే ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాను తెలుగులో కూడా తప్పకుండా రీమేక్ చేస్తారు అనడంలో సందేహం లేదు.
కొన్ని వివాదాలతో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన సంజయ్ దత్ తిరిగి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటె, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను సంజయ్ దత్ కలవడం పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు ఆ ఇద్దరినీ సంజయ్ దత్ కలిశారు అనే దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
సంజయ్ దత్ .. మెగాస్టార్ చిరంజీవి సినిమాను సెట్ చేస్తున్నారని, ఆ సినిమాకు రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి.
MrC in conversation with @duttsanjay Bhai. An evening to remember forever. #ramcharan pic.twitter.com/Y7qxxWi5xl
— Upasana Konidela (@upasanakonidela) January 10, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa