టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం 'బింబిసార' తో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ స్టార్ హీరో ఇప్పుడు 'డెవిల్' అనే సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మూడో షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులని మూవీ మేకర్స్ ప్రారంభించారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరోసారి క్రేజీ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.