మెగాస్టార్ చిరంజీవి గారి నుండి వచ్చిన రీసెంట్ హిట్ మూవీ "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి, సత్యదేవ్, నయనతార, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయా భరద్వాజ్, దివి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. థమన్ సంగీతం అందించారు.
అద్భుతమైన థియేటర్ రన్ ను, ఆపై అమేజింగ్ డిజిటల్ రన్ ను జరుపుకున్న గాడ్ ఫాదర్ అతి త్వరలోనే ప్రముఖ బుల్లితెర ఛానెల్ జెమినీటీవీలో సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు సదరు సంస్థ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఐతే, ఏ తేదీన గాడ్ ఫాదర్ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది.
![]() |
![]() |