ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గానే సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ బృందం నుండి యూ/ ఏ సెర్టిఫికెట్ కూడా తెచ్చుకుంది.
తాజాగా మెగా మాస్ ట్రైలర్ లోడింగ్... అప్డేట్ వెరీ సూన్... అని పేర్కొంటూ వాల్తేరు వీరయ్య మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. దీంతో, ఈ రోజే వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.