నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న కొత్త సినిమా "వీరసింహారెడ్డి" USA ప్రీ సేల్స్ కలెక్షన్స్ 100కే డాలర్ మార్క్ క్రాస్ అయ్యాయని నిన్ననే అఫీషియల్ గా తెలియగా తాజాగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" USA ప్రీ సేల్స్ కలెక్షన్స్ 100కే డాలర్ మార్క్ ను క్రాస్ చేశాయని అధికారికంగా తెలుస్తుంది. సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ రెండు సినిమాలు కూడా ప్రీ సేల్స్ లో USA ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన అందుకుంటున్నాయి. విడుదల తరవాత ఈ రెస్పాన్స్ ఎక్కువ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో మాస్ రాజా రవితేజ కీ రోల్ లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతుంది.