నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి"తో కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్ రంగప్రవేశం చెయ్యబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన తెలుగు మీడియాకు కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.
తాజాగా దునియా విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. MP సంతోష్ గారు ఇనీషియేటివ్ తీసుకుని మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మూడేసి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కాబోతుంది.