బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది దీపికా. అందులో ఒకటి ఒకటి. చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీపికా తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.550 కోట్లతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పాన్ వరల్డ్ ఫిల్మ్ గా నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించబోతుండటం విశేషం.
అయితే, ఈ రోజు దీపికా పదుకొణె పుట్టిన రోజు. జనవరి 5న 1986లో డెన్మార్క్ లో జన్మించిన ఈబ్యూటీ తాజాగా 37వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా దీపికా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కే’ టీమ్ నుంచి కూడా స్పెషల్ విషెస్ అందుకుంది. చిత్ర యూనిట్ దీపికా బర్తడే సందర్భంగా ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రాండ్ లుకింగ్ లో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు మరో విషయంలోనూ ఆసక్తిని పెంచుతోంది.