ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి - రామ్ సినిమా షూటింగ్లో జాయినైన శ్రీలీల

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:37 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రామ్ పోతినేని పవర్ఫుల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి రామ్ కలయికలో ఒక కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి అలరించనుంది.


ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రోజే ఈ మూవీ న్యూ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీలీల పాల్గొంటున్నారు. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీలీల ఆ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యకుండానే రామ్ - బోయపాటి సినిమా న్యూ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa