రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో గత సంవత్సరం ఫాంటసీ డ్రామా 'బింబిసార'తో భారీ హిట్ సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అమిగోస్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క కొత్త పోస్టర్ ని 3వ డోపెల్‌గ్యాంజర్ - ది అనామిమస్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ అమిగోస్ ని విడుదల చేసారు. అంతేకాకుండా, ఈ చిత్రం యొక్క ఆసక్తికరమైన టీజర్‌ను జనవరి 8, 2023న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఫిబ్రవరి 10, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa