చలి చలిగా అల్లింది
గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గీచి గీచి గీచి గీచి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి వూసులు ఇంకేవో
గుచి గుచి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు వూహలు
నువ్వు నా వూపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు
హూ చలి చలిగా అల్లింది
గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు
గొడవలతో మొదలై
తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైన
బలపడి పోతుందే ఉండే కొద్దీ
లోయ లోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్ని తారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమయినట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు వూహలు
నువ్వు నా వూపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు
ని పై కోపాన్ని ఎందరి ముందయినా
బెదురే లేకుండా తెలిపే నేను
ని పై ఇష్టాన్ని నేరుగా నీకయినా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేను దూరం అవుతున్న నీ అల్లరులన్ని గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలన్న నా చెంతకి ని అడుగులు పడుతూ ఉంటె
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు వూహలు
నువ్వు న వూపిరైనట్టు నా లోపలున్నట్టు
ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు