నిన్న సాయంత్రం టాలీవుడ్ జేజమ్మ అనుష్క చేతుల మీదుగా డిజిటల్ లాంచ్ ఐన 'కళ్యాణం కమనీయం' ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. 2 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ #3 ట్రెండింగ్ పొజిషన్లో దూసుకుపోతుంది ఈ ట్రైలర్. మరి, వెండితెరపై మ్యాజిక్ చేసి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగలిగితే, ఈ బొమ్మ సూపర్ హిట్టే అన్నమాట.
సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్ట్ చెయ్యగా, యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 14న కళ్యాణం కమనీయం చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.