అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా, దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ "హిట్ 2". డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిట్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఒక్కరోజు రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన హిట్ 2 ఇప్పుడు ప్రైమ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. థియేటర్ ఆడియన్స్ ను అలరించిన హిట్ 2 డిజిటల్ ప్రేక్షకులను ఏమేరకు అలరించగలదో చూడాలి.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించగా, ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.