క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా "రంగస్థలం". ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రత్యేక భాగమైన విషయం తెలిసిందే.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా 'హాస్యబ్రహ్మ' బ్రహ్మానందం గారిని 'చక్రపాణి' గా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అతి త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ రానుంది.