కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ "వారిసు". తెలుగులో "వారసుడు". దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో జనవరి 11న విడుదల కాబోతుందని రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఐతే, వారసుడు రిలీజ్ డేట్ పై ఇప్పటికీ మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. సంక్రాంతి రిలీజ్ అని ప్రోమోట్ చేస్తున్నప్పటికీ ఖచ్చితమైన డేట్ ను మెన్షన్ చెయ్యకపోవడంతో, లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఏమైనా ఉంటాయేమోనని అంతా అనుకున్నారు. ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ ఈరోజే వారసుడు నైజాం ఏరియా ఫస్ట్ చార్ట్ విడుదలైంది. అందులో వారసుడు సంక్రాంతి రిలీజ్ అని పేర్కొన్నారు. దీంతో డేట్ ఇంకా ఫిక్స్ అవ్వకపోయినా వారసుడు సినిమా మాత్రం సంక్రాంతి కానుకగా ఈవారంలోనే విడుదల కాబోతుందని సాలిడ్ క్లారిటీ వచ్చింది.