నిన్న రాత్రి విడుదలైన వీరసింహారెడ్డి ట్రైలర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన కొన్ని గంటలలోనే 5 m వ్యూస్, 300కే లైక్స్ తో యూట్యూబ్ #1 పొజిషన్లో దూసుకుపోతుంది. బాలయ్య పవర్ఫుల్ మాస్ డైలాగులు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని టేకింగ్, థమన్ అందించిన పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ... ఈ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. దీంతో యూట్యూబ్ లో ఈ ట్రైలర్ వీక్షణల ఊచకోత కోస్తుంది.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ ప్లే చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.