ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమా కోసం తాను బాధ్యతతో పని చేశా: చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 06:19 PM

'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంపై స్పందించడానికి తనకు మాటలు కూడా రాలేదని చెప్పారు. మనం మాట్లాడటం ఆపేపి, ప్రేక్షకులు చెప్పేదే విందామని అన్నారు. ప్రేక్షకుల ఉత్సహమే మనల్ని నడిపించే ఇంధనమని చెప్పారు. ఈ సినిమా కోసం తాను బాధ్యతతో పని చేశానని అన్నారు. 


కష్టం తనది, రవితేజది కాదని... సినిమా బాగా రావాలని పని చేసిన వారిదని చెప్పారు. ఈ విజయం సినీ కార్మికులదని అన్నారు. ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని సూచించారు. ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com