ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మజిలీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 12:01 PM

రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్(ప్రేమెక్కడుంటుందో.. బాధ అక్కడే ఉంటుంది)’ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 సంక్రాంతి సందర్బంగా   మజిలీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ . దివ్యాన్షా కౌషిక్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa