తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు ఎవరు అంటే చిరంజీవి, బాలకృష్ణ అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఇదిలావుంటే సంక్రాంతి కానుకగా విడుదలై వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. బాలకృష్ణ, చిరంజీవి అభిమానులకు పండగ ఆనందం డబులైంది. రెండు చిత్రాలూ మంచి టాక్ తో దూసుకెళ్తున్నాయి. భారీ వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. వాల్తేరు వీరయ్య రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల మార్కు దాటింది. ఈ చిత్రం ఇప్పటికే 1.3 మిలియన్లు.. దాదాపు పదిన్నర కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక, వీరసింహారెడ్డి సైతం అదే జోరు కనబరుస్తోంది. ఈ చిత్రం సైతం మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది.
![]() |
![]() |