ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ తో కలసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సౌగతా రాయ్ స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కోల్ కతాలో నిన్న టీఎంసీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రవీనా ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తనతో కలసి డ్యాన్స్ చేయాలని సౌగతా రాయ్ ను రవీనా కోరింది. దీంతో, రవీనాతో కలసి ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. 1994లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'మెహ్రా'లోని 'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' సాంగ్ కు రవీనాతో కలసి కాలు కదిపారు. అంతేకాదు తమతో పాటు స్టెప్పులేయాలని వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా రవీనా ఆహ్వానించింది.
ఈ సందర్భంగా రవీనా మాట్లాడుతూ, డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇంత జోష్ గా ఉండే వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని తెలిపింది. సౌగతా రాయ్ చాలా స్పోర్టివ్ పర్సన్ అని కితాబిచ్చింది.
Watch TMC MP Prof Saugata Roy groove with Bollywood star Raveena Tandon at an event in #Kolkata! #UserGeneratedContent. @iindrojit
More videos: https://t.co/FAHzdjSiWA pic.twitter.com/b7nCNTOLrj
— India Today (@IndiaToday) January 17, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa