క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "రావణాసుర". సుశాంత్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 26వ తేదీన రావణాసుర నుండి గ్లిమ్స్ ను విడుదల చెయ్యడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, RT టీం వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.