ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కలయికలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా "ఏజెంట్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
సంక్రాంతి 2023 కి ఏజెంట్ విడుదల అవుతుందని ఆశగా ఎదురుచూసిన అక్కినేని అభిమానులకు నిరాశే మిగిలింది. ఐతే, న్యూ ఇయర్ కానుకగా .. సమ్మర్ 2023 లో పాన్ ఇండియా థియేటర్లకు ఏజెంట్ రాక ఉంటుందని తెలిపి అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఏజెంట్ చిత్రబృందం.
తాజా బజ్ ప్రకారం, రిపబ్లిక్ డే రోజున అంటే జనవరి 26వ తేదీన ఏజెంట్ టీం నుండి విడుదల తేదీపై సాలిడ్ క్లారిటీ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకైతే, ఈ విషయంపై ఏజెంట్ టీంనుండి ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేదు..కానీ, ఆరోజున సడెన్ సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.
![]() |
![]() |