సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానని కమల్ ప్రకటించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, కమల్ ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచిన సంగతి తెలిసిందే.