75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగరంగా వైభవంగా చేయడానికి ప్రభుత్వాలు సన్నద్ధం అయ్యాయి.ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బుధవారం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత డాక్టర్ దిలీప్ మహలనాబిస్‌ను పద్మవిభూషణ్ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ముగ్గురు కావడం గమనార్హం. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పేరును చాటిచెప్పిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఉన్నారు. సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను టాలీవుడ్‌కి అందించారు కీరవాణి. ఆయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది.