ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“హంట్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:08 PM

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా ఆసక్తికరమైన థ్రిల్లర్ “హంట్”.  డైరెక్టర్ మహేష్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రం ఈ జనవరి 26 నే రిలీజ్ కాగా  ఈ చిత్రంలో భరత్ కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని తాజా సమాచారం. దీని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 10 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.. దీంతో ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి వస్తున్న ఫాస్టెస్ట్ స్ట్రీమింగ్ మూవీ ఇదే అని చెప్పాలి. ప్రతి సినిమాకు మినిమమ్ 8 వారాలు ఉండాలనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా ఇంత త్వరగా విడుదలకు సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa