నందమూరి కళ్యాణ్ రామ్, అషికా రంగనాథ్ జంటగా, దర్శకుడు రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం "అమిగోస్". ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విశేషమేంటంటే, ఈ సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి ... బాలయ్య ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ను రీమిక్స్ వెర్షన్ లో తీసుకురాబోతున్నారు. అంతకుముందు బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ అరె ఓ సాంబా.. ను కూడా కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఒక రొమాంటిక్ సింగిల్ ను రీమిక్స్ వెర్షన్ లో తీసుకురాబోతున్నారంటే, ఆడియన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 05:09 నిమిషాలకు ఎన్నో రాత్రులొస్తాయి పూర్తి వీడియో సాంగ్ విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa