'కలర్ ఫోటో' తో ఏడిపించి, హిట్ 2 తో భయపెట్టిన నటుడు సుహాస్ హీరోగా నటించిన కొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాతో సుహాస్ ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, ఎక్జయిట్మెంట్ కి గురి చేస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన ఈ సినిమాతో సుహాస్ మరో సూపర్ హిట్ కొట్టినట్టుగానే కనిపిస్తుంది. ఫ్యామిలీ స్క్రీనింగ్స్ తో ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చెయ్యడం మొదలెట్టింది. ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ నుండి కూడా యూనానిమస్ పాజిటివ్ రివ్యూలు సంపాదిస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి చాలా మంచి బుకింగ్స్ జరుగుతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.