గుణశేఖర్ దర్శకత్వంలో సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ పీరియాడికల్ డ్రామా ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అభిమానులలో కొంత గందరగోళానికి కారణమైంది. రానున్న రోజులలో మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే పద్మశ్రీ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ చిత్రం యొక్క పాటలు మెలోడీ మరియు ఆవిష్కరణ పరంగా ఆకట్టుకుంటున్నాయని ట్వీట్ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మకు అభినందనలు తెలిపారు.
దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa