నిన్న మధ్యాహ్నం రావాల్సిన "ఏజెంట్" మూవీ మాస్సివ్ అప్డేట్ లెజెండరీ దర్శకుడు శ్రీ కే. విశ్వనాధ్ గారి మరణం కారణంగా, ఆయనకు గౌరవ సూచకంగా ఈ రోజుకి వాయిదా పడింది. మరో మూడు గంటల్లోనే అంటే మధ్యాహ్నం 02:14 నిమిషాలకు ఏజెంట్ చిత్రబృందం మేజర్ ఎనౌన్స్మెంట్ చెయ్యనుంది.
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.