నేషనల్ అవార్డు విన్నింగ్ లెజెండరీ ప్లే బ్యాక్ సింగర్ వాణి జైరాం గారు ఇక లేరు. చెన్నై నుంగంబాక్కం లోని తన సొంతింటిలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది గణతంత్య్ర దినోత్సవం నాడు భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఆమె వయసు 78.
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పూరి, తుళు, ఒరియా తదితర భారతీయ భాషల్లో వాణి జైరాం గారు పాటలు పాడారు. మూడుసార్లు నేషనల్ అవార్డు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు అందుకున్నారు. తమిళనాడు, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, ఒడిశా స్టేట్ అవార్డులను అందుకున్నారు.
వాణి జైరాం గారు రీసెంట్గానే 50వసంతాల సింగింగ్ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. 10,000 కి పైగా పాటలను పాడారు.