బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇన్నాళ్ళు జనాలను కన్ ఫ్యూజన్ లో పెట్టి.. ప్రేమాయణం సాగించిన కియారా,సిద్థార్ద్ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గతకొంత కాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్ళి ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 6న రాజస్థాన్ జైసల్మేర్‌లోని ఓ ప్యాలేస్‌లో వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరగబోతుంది. రెండు కుటుంబాల అనుమతితో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇక తాజాగా కియారా అద్వానీ తన కుటుంబంతో కలిసి జైసల్మేర్‌కు బయలుదేరింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ స్టార్ల ఇద్దరి పెళ్లి ప్లానింగ్ చూసుకున్నట్టయితే.. ఫిబ్రవరి 4,5 తేదిల్లో మెహెందీ, హల్దీ ఫంక్షన్‌లు జరుగబొతన్నాయి. 6 తేదీన పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
A step closer to the wedding bells #KiaraAdvani landed at Jaisalmer airport with designer #ManishMalhotra pic.twitter.com/qrod373vr3
— Take One Filmy (@TakeOneFilmy) February 4, 2023