కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో దిల్ రాజు నిర్మించిన "వారసుడు" మూవీ నుండి కొంతసేపటి క్రితమే సోల్ ఆఫ్ వారసుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. సీనియర్ గాయని చిత్ర గారి మధురమైన గాత్రంలో ఈ పాట వినడానికి ఎంతో హృద్యంగా అనిపిస్తుంది. ఇక, చూస్తుంటే, కంటతడి తప్పనిసరి. అమ్మ నేపథ్యంలో రూపొందిన ఈ పాటకు థమన్ హార్ట్ మెల్టింగ్ ట్యూన్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు అందమైన లిరిక్స్ ను అందించారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa