మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' మూవీ భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన కాసేపటికే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్లలో మాత్రం 'స్పైడర్' ఏ మాత్రం తగ్గలేదు. తొలి రోజున ఏకంగా రూ. 51 కోట్లను కలెక్ట్ చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు కూడా ఈ సినిమా ఇదే జోరును ప్రదర్శించింది. సెకండ్ డే రూ. 34 కోట్లను వసూలు చేసిందని... తొలి రెండు రోజుల్లో రూ. 85 కోట్లను కలెక్ట్ చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలిపాడు. ఈ వీకెండ్ లో 100 కోట్ల మార్క్ ను అధిగమిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa