ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ప్రీమియర్ కి తయారైన సంతోష్ శోభన్ రీసెంట్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 01:15 PM

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కొత్త చిత్రం "కళ్యాణం కమనీయం". అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ డిబట్ చేసింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది.


సంక్రాంతి కానుకగా థియేటర్లకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మెప్పు పొందేటందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఈ నెల 10 నుండి ఆహా ఓటిటిలో కళ్యాణం కమనీయం డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుందని తెలుస్తుంది. ఐతే, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa