నటసింహం నందమూరి బాలకృష్ణ గారిపై వస్తున్న ఆరోపణల గురించి తెలిసిందే. ఆహా ఓటిటిలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తనకు జరిగిన ప్రమాదం గురించి వివరిస్తూ వైద్యం అందించిన నర్సు భలే అందంగా ఉందిలే అంటూ ..వ్యాఖ్యానిస్తారు. ఆ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా బాలయ్య ఈ కాట్రవర్సీ పై స్పందిస్తూ..తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినా కానీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే అందుకు తాను పశ్చాత్తాపం పడుతున్నానని బాలయ్య వివరించారు. ఈ మేరకు నర్సులు అందించే సేవలకు గానూ వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.