ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ : RC 15 న్యూ షెడ్యూల్ వాయిదా ..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 05:08 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం "RC 15". దిగ్గజ కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చెర్రీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి, దర్శకుడు, నటుడు సూర్య SJ కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రోజు జరగాల్సిన RC 15 న్యూ సాంగ్ షూటింగ్ ఫిబ్రవరి 9కి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే, ఈ రోజు హీరోయిన్ కియారా అద్వానీ వివాహజీవితంలోకి అడుగు పెట్టబోతున్న రోజు మరి. ఈ కారణంగానే RC 15 షెడ్యూల్ ను వాయిదా వేసారట. పోతే, రాజస్థాన్, జై సల్మేర్ లో ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా ఈ రోజే ఏడడుగులు వెయ్యబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa