మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'ధమ్కీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ సినిమాలోని చివరి పాట షూటింగ్‌ని ఈ వారంలోనే స్టార్ట్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం, ఈ పబ్ పాటను ఈ వారం 3 రోజుల పాటు హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. షూటింగ్ పూర్తి కాగానే డబ్బింగ్ పనులు మొదలుకానున్నాయి.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa