ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : విశ్వక్ సేన్ 'ధమ్కీ' విడుదల వాయిదా..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 10:43 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దాస్ కా ధమ్కీ". నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.


ఈ నెల 17న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడబోతున్నట్టు నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ వస్తుంది. CG వర్క్ కొంతమేర పెండింగ్ లో ఉండడం కారణంగా దాస్ కా ధమ్కీ మూవీ ఈ నెల 17న విడుదల కావట్లేదని, అతి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని, ఈసారి థియేటర్లలో ఇచ్చి పడేద్దాం..అని పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ విడుదలైంది. 


వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్త బ్యానర్లపై ఈ సినిమా నిర్మింపబడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa