కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ విరామం తదుపరి ఈ మధ్యనే " పఠాన్ " సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, బాద్షా యాక్టింగ్ కి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో కింగ్ ఖాన్ కి తోడుగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కొంచెం సేపు కనబడతారు. ఈ ద్వయాన్ని బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. పఠాన్ బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించడంలో సల్మాన్ పాత్ర కూడా చాలా కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐతే, ఇప్పుడు ఈ ఖాన్ల ద్వయం మరోసారి వెండితెరపై కనిపించి, అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఐతే, ఈసారి సల్లూభాయ్ "టైగర్ 3" లో కింగ్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు. టైగర్ 3 ఈ ఏడాది దీపావళికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇంకేముంది, వీరిద్దరి రాకతో బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ తప్పనిసరి. ఎలా ఐతే, పఠాన్ వసూళ్ల వర్షం కురిపిస్తూ, మ్యాజిక్ చేస్తుందో, దీపావళికి టైగర్ 3 కూడా అలాంటి మ్యాజిక్ నే సృష్టించబోతోంది అన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa